Home  »  TV News  »  రిషిపై వేసిన నింద వెనుక కారణమేంటో చెప్పమన్న మినిస్టర్!

Updated : Jun 20, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -793 లో.. జగతి, మహేంద్ర ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండడం ధరణి చూడలేకపోతుంది. ఎన్ని రోజులు ఇలా ఉంటారు.. అసలు జగతి అత్తయ్య ఎందుకు నిజం చెప్పడం లేదని ధరణి అనుకుంటుంది. వెళ్లి చిన్న మామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనుకుంటుంది. 

ఆ తర్వాత మహేంద్ర దగ్గరికి ధరణి వెళ్లి ఎన్ని రోజులు ఇలా మాట్లాడకుండా ఉంటారు. మీరు ఇద్దరు ఎంత బాగా కలిసి ఉండేవారు. మీరు అలా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నని ధరణి అంటుంది. నా కొడుకుపై మోసగాడు అనే ముద్ర వేసి ఎక్కడికో పంపించారు అయిన అసలు నిజం ఇంకా చెప్పట్లేదని మహేంద్ర అంటాడు. అత్తయ్య నిజం చెప్పకపోవడనికి కారణం ఉండే ఉంటుంది కదా అని ధరణి చెప్పగా.. ఇలా ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటుందని మహేంద్ర అంటాడు. అప్పుడే ధరణి ఏదో చెప్తుండగా శైలేంద్ర రావడం గమనించి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు కేడి బ్యాచ్ క్లాస్ కి వెళ్లకుండా బయట కూర్చొని ఉంటారు.

అటుగా వస్తున్న రిషి వాళ్ళని చూసి‌.. క్లాస్ కి వెళ్లకుండా ఏం చేస్తూన్నారని అడుగుతాడు. కేడి బ్యాచ్ తిక్క సమాధానం చెప్పడంతో రిషికి కోపం వచ్చి గ్రౌండ్ లో ఉన్న చెత్త మొత్తం కేడి బ్యాచ్ తో క్లీన్ చేయిస్తాడు. మరొక వైపు జగతి మినిస్టర్ ని కలవడానికి వెళ్తుంది. రిషి ఉన్నప్పుడు,  రిషీ లేనప్పుడు కాలేజీలో చాలా మార్పు వచ్చింది. ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్ కి ఎవరు ముందుకు రావడం లేదు. మిషన్ ఎడ్యుకేషన్ కూడా వెనకబడి పోయిందని జగతితో మినిస్టర్ అంటాడు. అసలు ఆ రోజు మీరు రిషిపై నింద వేసింది అబద్ధమని నాకు తెలుసు కానీ మీరు అలా చెయ్యడానికి కారణం ఉందేమోనని సైలెంట్ గా ఉన్నాను. ఇప్పటికైన చెప్పండని జగతిని మినిస్టర్ అడుగుతాడు. టైమ్ వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయని జగతి అంటుంది. సర్ మీకు వసుధార ఎక్కడ ఉందో తెలుసా అని మినిస్టర్ ని జగతి అడుగుతుంది. తెలియదు రిషి కోసం వెతికిస్తూన్న తెలియట్లేదని మినిస్టర్ అంటాడు.

మరొక వైపు రిషి, వసుధారలు ఒకరినొకరు చూసుకుంటూ దూరంగా నడుచుకుంటూ వెళ్తారు. రిషి ఒక పేపర్ పై గతం నాకు గుర్తు లేదు గుర్తు చేసే ప్రయత్నం చెయ్యకని రాసి పెట్టి వెళ్తాడు. అది చూసిన వసుధార గతం గుర్తు చెయ్యొద్దు అంటునే నన్ను గుర్తుచేసుకుంటున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.